ధరణి ఉద్యోగుల సంఘం  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గా చెన్నగాని పురుషోత్తం 

ధరణి ఉద్యోగుల సంఘం  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గా చెన్నగాని పురుషోత్తం 

ముద్ర నేరేడుచర్ల:-హైదరాబాద్ లో ధరణి ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఏకగ్రీవంగా నూతన రాష్ట్ర అధ్యక్షుడు గా సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం గ్రామము కు చెందిన  చెన్నగాని పురుషోత్తం గౌడ్ ను , ప్రధాన కార్యదర్శి గా హనుమకొండ జిల్లా ధరణి టెక్నికల్ స్టాఫ్ నాగరాజు ను ఎన్నుకోవడం జరిగింది.

నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన చిన్నగాని పురుషోత్తం ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ తనకు భాద్యతలు అప్పజెప్పిన తన తోటి ధరణి ఉద్యోగుల కు  అందరికి కృతజ్ఞతలు తెలిపినారు.తోటి ఉద్యోగుల అందరి అభిప్రాయం ను వమ్ము చేయకుండా శాయశక్తులా ధరణి ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు నెరవేర్చుటకు కృషి చేస్తానని  హామీ ఇచ్చారు. ధరణి లో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు తన ఎన్నికకు సహకరించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.