తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటాపోటీగా దరఖాస్తులు.

తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటాపోటీగా దరఖాస్తులు.
  • ప్రజలతో సత్సంబంధాలు ఆర్థిక పరమైన సామాజిక పరమైన విషయాలపై అభ్యర్థి ఎంపిక ఉంటుందని ఊహగానం.
  • బలమైన అభ్యర్థికి మాజీ మంత్రి ఆశీస్సులా?
  • మాజీ మంత్రిని ఆశీస్సులు పొందడం కోసం పిడమర్తి రవి తీవ్ర ప్రయత్నం.
  • డాక్టర్ పిడమర్తి రవి ప్రయత్నం ఫలించేనా?
  • తుంగతుర్తి అభ్యర్థిత్వం పొందేనా?

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేయడానికి సుమారు డజను వరకు అభ్యర్థులు దరఖాస్తులు గాంధీ భవన్లో సమర్పించినట్లు సమాచారం.వీరిలో కొంతమంది ఎవరి పైరవీలు లేనివారు, కాగా మరి కొంత మంది తమ ఎదుగుదలకు కారణమైన నాయకుల పై విశ్వాసంతో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం .దరఖాస్తుల పరిశీలనలో అభ్యర్థి రాజకీయ నేపథ్యం ,ప్రజా సంబంధాలు, ఆర్థిక స్థితి గతులే ప్రధాన అంశాలుగా పరిగణలోకి తీసుకోవచ్చనేది పలువురి మాట .ఇదే నేపథ్యంలో  ప్రజా సంబంధాలు కలిగిన వారు దరఖాస్తు దారు లలో చాలామంది ఉన్నారు .కాగా ప్రస్తుత ఎన్నికలు పూర్తిగా ఆర్థిక సంబంధం తోనే ముడిపడి ఉన్నాయనేది వాస్తవం .స్వచ్ఛంద రాజకీయాలు ఏనాడో కనుమరుగయ్యాయని నేటి ఎన్నికల్లో డబ్బుదే  హవాగా ప్రాధాన్యత అనేది రాజకీయ విశ్లేషకులు మాట .సర్వేల్లో ప్రజలు సూచించే వ్యక్తి ఆర్థికంగా ఉండగలిగితే నే అధిష్టానం ఆలోచించే అవకాశం ఉంటుందనేది పలువురు మాట .నియోజకవర్గంలో బలంగా అధికారంలో ఉండి రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేను ఢీ కొనాలంటే ప్రజల్లో తిరిగితేనే సరిపోదని గట్టి పోటీకి ఆర్థికంగా బలంగా కూడా ఉండాలని పలువురి కాంగ్రెస్ నాయకుల మాట. ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజల్లో పేరు ఉన్నవారు ఉన్న ఆర్థికంగా అంత బలం కలిగిన వారు అంతంత మాత్రమే.  తాము అభ్యర్థులను సూచిస్తే వారికి ఆర్థికంగా సహాయం చేయాల్సిందేనని అలాగని తాము సైతం పోటీ చేస్తూ మరో అభ్యర్థికి ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చు పెట్టాలంటే కష్టమైన దేనని సీనియర్ల ఆలోచనగా తెలుస్తోంది .ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా చేరిన ఉద్యమ నాయకులు డాక్టర్ పిడమర్తి రవి  తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నారు .అంతకు ముందు నుండే నియోజకవర్గ గాడ్ ఫాదర్ మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని కలిసినట్లు సమాచారం .అలాగే సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తో సన్నిహితంగా నే ఉన్నట్లు తెలుస్తోంది .తుంగతుర్తి టికెట్ ఆశించే వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉంటే గెలుస్తారనీ అలాంటి వ్యక్తికే మద్దతు ఉంటుందనేది సర్వత్రా వినవస్తున్న మాట .డాక్టర్ పిడమర్తి రవి కి పొంగులేటి ఆర్థిక మద్దతు బలంగా ఉండటం కలిసి వచ్చే ప్రధాన అంశంగా చెబుతున్నారు. అలాగే ఉద్యమ కాలంలో పలుమార్లు తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించిన పిడమర్తి కొంత సుపరిచితుడు కావడం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.

అంతేగాక సామాజిక వర్గ విషయానికి వస్తే మాదిగ సామాజిక వర్గానికి చెందిన పిడపర్తి రవికి ఆ సామాజిక వర్గం ఓట్లు సుమారు 50 వేలు ఉండటం కలిసి వచ్చేదిగా చెప్తున్నారు. అంతేగాక తనను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చిన పొంగులేటి ద్వారా మాజీ మంత్రితో త్వరలో భేటీ కానున్నట్లు సమాచారం . పిడమర్తి రవి అనుకున్నట్లు సాగితే తుంగతుర్తి అభ్యర్థిత్వం అందుకోవచ్చు అనేది పలువురి మాట . ఈసారి తుంగతుర్తి నియోజకవర్గ రిజర్వేషన్ మార్పు జరిగి వచ్చేసారీ జనరల్ గా మారుతుందని అందుకే గతంలో రెండుసార్లు వర్గపోరుతో అంతగా ప్రాధాన్యత ఇవ్వని కాంగ్రెస్ అధినాయకత్వం ఈసారి కాంగ్రెస్ గెలుపొందేల వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం డిసిసి అధ్యక్షులు  చెవిటి వెంకన్న యాదవ్  తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానికుడు కావడం అది మాజీ మంత్రి కుడి భుజం కావడంతో జనరల్ స్థానాల్లో మాజీ మంత్రి అవకాశం ఇస్తే ఎమ్మెల్యే కావచ్చు అనే వ్యూహంతో కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యం గా డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ముందుకు సాగుతున్నట్లు సమాచారం . Okఅందుకే బలమైన ఆర్థిక స్థితిగతులు ఉన్న పిడమర్తి రవికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది .ఈ సారి కాంగ్రెస్ గెలిస్తే వచ్చేసారికి కూడా తిరుగు ఉండదనికాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది .డాక్టర్ పిడమర్తి రవి చేస్తున్న ప్రయత్నాలకు మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు తుంగతుర్తి కాంగ్రెస్ పీఠాన్ని ప్రతిష్టించిన రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఆమోదిస్తారా? డిసిసి అధ్యక్షులు బీసీ సామాజిక వర్గ నేత చెవిటి వెంకన్న యాదవ్ సైతం మాజీ మంత్రి ఆమోదిస్తే పిడమర్తి గెలుపుకు కృషి చేయడం ఖాయం అనేది విశ్లేషకుల మాట. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అవుతారు? ఎవరి వ్యూహం ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.