అవినాశ్​ రెడ్డి విచారణకు సహరించడంలేదు :  సీబీఐ 

అవినాశ్​ రెడ్డి విచారణకు సహరించడంలేదు :  సీబీఐ 

ఎంపీ అవినాశ్​ రెడ్డి పిటిషన్​పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. కేసు దర్యాప్తులో మొదటి నుంచి ఆటంకాలు సృష్టిస్తున్నారన్న సీబీఐ. అవినాశ్​ రెడ్డి విచారణకు సహరించడంలేదని సీబీఐ చెప్పింది. దర్యాప్తు జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పింది. నోటీసు ఇచ్చినప్పడల్లా ఏదో కారణం చెప్పి హాజరుకావడంలేదని తన వాదన వినిపించింది. ఎంతోమందిని విచారించాం. కొందరిని అరెస్టు చేశామని చెప్పింది. మిగతా వారికి లేని ప్రత్యేక పరిస్థితి అవినాశ్​కు ఏంటని సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగింది. రాజకీయ కారణంతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ చెప్పింది. ఈ సందర్భంగా సామాన్యల కేసుల్లో కూడా  ఇంత సమయం తీసుకుంటారా? అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. లోక్​సభ అభ్యర్థిగా అవినాశ్​ను అనధికారికంగా ముందే ప్రకటించారని స్టేట్​మెంట్లు చెబుతున్నాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించినట్లు స్టేట్​మెంట్స్​ ఉన్నాయి. రాజకీయంగా అవినాశ్​ బలవంతుడని మీరే అంటున్నారు. అలా అయితే వివేకాను చంపాల్సిన అవసరమేంటి? అని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. కడప ఎంపీ టికెట్​ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు. వివేకాపై రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాశ్​ భావించారని సీబీఐ చెప్పింది.