రేగోడ్ లో నిరుద్యోగుల నల్ల బ్యాడ్జీలతో నిరసన

రేగోడ్ లో నిరుద్యోగుల నల్ల బ్యాడ్జీలతో నిరసన

పెద్ద శంకరంపేట, ముద్ర: తెలంగాణ రాష్ట్రం సాధించాక నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయకుంటే  టి ఎస్ పి ఎస్ సి ఉద్యోగులు సైతం అవినీతి అక్రమాలకు పాల్పడడం పట్ల నిరుద్యోగ యువకులు మండల కేంద్రం రేగోడ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన  చేపట్టారు. టీఎస్పీఎస్సీ లీకుల వ్యవహారం పట్ల నిరుద్యోగ యువత జీవితాలు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. లీకుల వ్యవహారంపై ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. టీఎస్పీఎస్సీ, ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి యువత రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వస్తున్నదన్నారు.

ప్రభుత్వ పెద్దలు లిక్కర్ స్కాంపై ఉంచిన శ్రద్ధ టీఎస్పీఎస్సీ వ్యవహారంపై ఉంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  తక్షణమే టిఎస్పిఎస్సి ఉద్యోగులను బర్తరఫ్ చేసి పారదర్శకంగా టిఎస్పిఎస్సి ఉద్యోగ నియామకాలు చేపట్టి  పరీక్షలను పారదర్శకంగా  నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో  నిరుద్యోగ పట్టభద్రులు గొల్ల మహేష్, అజయ్, నరేష్, వంశీ, మహేష్ గౌడ్, హరీష్, సతీష్, రఫీ, నరేష్, ప్రవీణ్, అమర్, మధు, అడ్వొకేట్ జగదీష్, బీజేవైఎం నాయకులు తుల్జారం, వార్డ్ మెంబర్ హరీష్, పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు.