‘వనమా’ పిటిషన్​కొట్టివేత

‘వనమా’ పిటిషన్​కొట్టివేత
  • స్టేకు నిరాకరించిన హైకోర్టు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు మరోసారి షాకిచ్చింది. ఆయన వేసిన పిటిషన్ ను గురువారం కొట్టేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ జూలై 25న హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో  ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. కాగా ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ 26న వనమా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు  చేశారు. తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేసేవరకు స్టే ఇవ్వాలని కోరారు.  అయితే పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు తీర్పును బుధవారం రిజర్వ్ చేసి, గురువారం కొట్టివేసింది.