నర్సింగ్ సిబ్బందివి.. అమ్మ లాంటి సేవలు

నర్సింగ్ సిబ్బందివి.. అమ్మ లాంటి సేవలు

వైద్యరంగంలో కీలక పాత్ర నర్సులదే.

ఆరోగ్య రక్షణలో వారిది ఎనలేని తోడ్పాటు.

కరోనా సమయంలోను వారి సేవలు ఆమోగం

మన వైద్య సేవలు యావత్ దేశానికే ఆదర్శం.

పేటలో మెడికల్ కళాశాల సంచాలనాత్మకం.

మెరుగైన వైద్యం, వైద్య విద్య మరింత చేరువయ్యాయి..

ప్రారంభం నాటి నుంచి అద్భుతమైన సేవలు.

రాబోయే రోజుల్లోనూ మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం.

త్వరలోనే నర్సింగ్ తో పాటు అన్ని పక్కా భవనాలు నిర్మించుకుందాం.

పేట నర్సింగ్ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా సేవాలందించాలి.

అందుకోసం అహర్నిశలు కష్టపడి చదవాలి.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

పేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: అమ్మ తరువాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత సమాజంలో నర్సింగ్ సిబ్బందిదే అని.. వైద్యరంగంలో కీలక పాత్ర పోషిస్తూ ఆరోగ్య రక్షణలో వారు ఎనలేని తోడ్పాటు నందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. కరోనా సమయంలోను వారి సేవలు ఆమోగమైనవని.. ఆసమయంలో మన సూర్యాపేట వైద్య సేవలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై నర్సుల వృత్తికి గౌరవాన్ని తీసుకువచ్చిన ప్లోరెన్స్ నైటింగేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచి మాట్లాడారు. పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచాలనాత్మకంగా ప్రసాదించిన మెడికల్ కళాశాలతో మెరుగైన వైద్యం, వైద్య విద్య మరింత చేరువయ్యాయన్నారు.

ప్రారంభం నాటి నుంచి అద్భుతమైన సేవలందిస్తూన్నామని.రాబోయే రోజుల్లోనూ మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కా భవనం పూర్తయిందని.. త్వరలోనే నర్సింగ్ తో పాటు అన్ని పక్కా భవనాలు నిర్మించుకుందాం. సూర్యాపేటలో చదువుతున్న నర్సింగ్ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా సేవలందించాలని ఆకాక్షిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం అహర్నిశలు కష్టపడి చదవి వారి కుటుంబాలకు, పేట కళాశాలకు మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించాలన్నారు. ఈ వేడుకల్లో  డిఎంహెచ్ఓ కోటా చలం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరెంటెండెంట్ దండ మురళీధర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ శారదా దేవి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ పాల్గొన్నారు.