ఆకట్టుకున్న వ్యవసాయ మేళా

ఆకట్టుకున్న వ్యవసాయ మేళా

మునగాల ముద్ర:-మునగాల మండలం ఆకుపాముల గ్రామం  సమీపాన ఉన్న అగ్రినెస్ట్   సంస్థ కార్యాలయం ఆవరణలో ఆ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వ్యవసాయ మేళా  ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా సూర్యాపేట ఖమ్మం జిల్లాలకు చెందిన పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు  వ్యవసాయ రంగంలో పలు పద్ధతులు, సాగులో మెలకువలు, పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ,  సేంద్రియ వ్యవసాయంపై నిర్వహించిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన  అగ్రిఘర్  ఫౌండర్ సౌమిని  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు  వెలుగులోకి తీసుకురావడం  ఇలాంటి కార్యక్రమాలతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆమె అభినందించారు.  అనంతరం వ్యవసాయ ప్రదర్శనలు ఆకట్టుకున్న విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రినెస్ట్ ఫౌండర్ తన్నీరు సురేష్, డైరెక్టర్ తన్నీరు  కీర్తి, రామ్ రెడ్డి,  కోటేశ్వర రావు ,మొలుగురి గోపి, ఖమ్మం సూర్యాపేట జిల్లాలో చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.