ఎఫ్.ఎల్.సి ని పరిశీలించిన అదనపు కలెక్టర్, జిల్లా ఎస్పీ.

ఎఫ్.ఎల్.సి ని పరిశీలించిన అదనపు కలెక్టర్, జిల్లా ఎస్పీ.

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: జిల్లాకు వచ్చిన  ఓటింగ్ యంత్రాలను సకాలంలో ఎఫ్.యల్.సి పూర్తి స్టాంగ్ రూమ్స్ లలో భద్ర పర్చనున్నట్లు ఉప జిల్లా ఎన్నికల అధికారి , అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ నందు ఓటింగ్ యంత్రాల ఎఫ్.ఎల్.సి కేంద్రం ను  జిల్లా యస్.పి. రాజేంద్రప్రసాద్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా  అదనపు కలెక్టర్  మాట్లాడుతూ ECIL నుండి జిల్లాకు వచ్చిన బ్యాలెట్ యూనిట్స్ 2019 కంట్రోల్ యూనిట్స్ 1649, వివిపాట్స్ 1783 లలో  ఇప్పటివరకు బ్యాలెట్ యూనిట్లు 1068, కంట్రోల్ యూనిట్లు 768, వివిఫ్యాట్స్ 776 లను పరిశీలించి ఎఫ్.యల్.సి చేపట్టామని అన్నారు.

అలాగే బి.యులు 19, కంట్రోల్ యూనిట్లు 03, వివిఫ్యాట్స్ 1 డిఫాల్ట్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. పార్టీ ల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని నుండి చకిలం రాజేశ్వరరావు, బి.జే.పి నుండి అబిడ్, బి.ఆర్.యస్ నుండి దేవరసెట్టి  సత్యనారాయణ   సమక్షంలో ఎఫ్.ఎల్.సి నిర్వహించామని అన్నారు. అనంతరం యస్.పి. మాట్లాడుతూ ఎఫ్.ఎల్.సి లో పోలీస్ బందోబస్తు తో పాటు పటిష్ట ఏర్పాట్లను చేపట్టామని పోలీస్ లు కేటాయించిన విధులు విధిగా  నిర్వహిస్తున్నారని  అన్నారు. ఈ కార్యక్రమంలో  డి.యస్.పి నాగభూషణం, ECIL ఇంజనీర్లు, ఎన్నికల సిబ్బంది, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.