నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీపై అవిశ్వాస నోటీస్

నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీపై అవిశ్వాస నోటీస్

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళి యాదవ్ పై 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసును మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు శుక్రవారం అందజేశారు. అందజేసిన వారిలో వైస్ చైర్మన్ నాయీమోద్దీన్, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, ఇస్రత్ సిద్ధికి, రాంచందర్, సునీతా, లక్ష్మి, సరిత, లలిత, రుక్కమ్మ ఉన్నారు.

ఇదివరకు ఫిబ్రవరి 13న కూడా అవిశ్వాసం నోటీస్ అందజేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మురళి యాదవ్ నర్సాపూర్ అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. బిఆర్ఎస్ తరఫున గెలుపొందిన మురళి యాదవ్ తర్వాత బిజెపిలో చేరి పోటీ చేశారు. అవిశ్వాసానికి ముందే మురళి యాదవ్ మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.