బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
  • ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
  • బ్రాహ్మణులు, మున్నూరు కాపు సంఘానికి ఎకరం చొప్పున భూమి కేటాయింపు

ముద్ర ప్రతినిధి, మెదక్: బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణులకు అన్ని విధాల ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాయాల్లో దూప, దీపం, పురోహితులకు ప్రభుత్వం ప్రతినెలా డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. నిరుపేద బ్రాహ్మణులను ఆదుకుంటామన్నారు. మెదక్ లో బ్రాహ్మణ భవనం ఏర్పాటు కోసం ఎకరం స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్బంగా పద్మాదేవేందర్ రెడ్డి దంపతులను బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు
మెదక్ పట్టణ ప్రజల ఆరాధ్య దైవం మాత నల్లపోచమ్మకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం భవనం నిర్మాణం కోసం ఎకరం స్థలం భూమి కేటాయింపు పత్రాలను సంఘం ప్రతినిధులకు ఎమ్మెల్యే అందజేశారు. వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఎంపీపీల ఫారం జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, లింగారెడ్డి, ఆశోక్ తదితరులున్నారు.