సునీతారెడ్డిని గెలిపించండి

సునీతారెడ్డిని గెలిపించండి

నర్సాపూర్ అభివృద్ధిలో వజ్రం తునక మదన్ రెడ్డి సముచిత గౌరవం సీఎం కెసిఆర్

నర్సాపూర్ ఎమ్మెల్యేగా వి. సునీత లక్ష్మారెడ్డిని గెలిపించాలని సీఎం కెసిఆర్ కోరారు. నర్సాపూర్ ను వజ్రం తునకాల మారుస్తానని హామినిచ్చారు. గురువారం సాయంత్రం జరిగిన సభలో కెసిఆర్ మాట్లాడుతూ.... సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, అభ్యర్థి సునీతా రెడ్డి విజ్ఞప్తి మేరకు దౌల్తాబాద్-కాసాల మున్సిపాలిటీ, రంగంపేట్ మండల కేంద్రం, కౌడిప‌ల్లికి డిగ్రీ కాలేజీ మంజూరు చేశాం. జిన్నారం మండలంలో కొన్ని గ్రామాల విలీనం, నర్సాపూర్ లో ఐటీఐ, నర్సాపూర్ మరింత అభివృద్ధి చేస్తా అన్నారు. నా చిరకాల మిత్రుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని సమూచితంగా గౌరవించి, స్థానం కల్పిస్తానని కెసిఆర్ సభలో ప్రకటించారు. ఆయ‌న ఎమ్మెల్యే కావ‌డానికి నేను ఎన్నో బాధ‌లు ప‌డ్డాను. ఆ విష‌యాల‌న్నీ మీకు తెలుసు. సునీతా ల‌క్ష్మారెడ్డి, మ‌ద‌న్ రెడ్డి క‌లిసి న‌ర్సాపూర్‌ను బ్ర‌హ్మాండంగా అభివృద్ధి చేస్తారు. సునీతా ల‌క్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు. ఒకప్పుడు న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి మంచి నీళ్లు రాక‌పోయేది.. కానీ ఇప్పుడు కోమ‌టిబండ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చామన్నారు.

ఇప్పుడు మంచినీళ్ల బాధ లేదు.. ఇక పిల్లుట్ల కాలువ ద్వారా సాగునీరు తీసుకొస్తే, న‌ర్సాపూర్ వ‌జ్ర‌పు తున‌క‌లా త‌యారవుతద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంజీరా న‌ది, హల్దీ న‌ది ఎట్ల ఉండేది కాంగ్రెస్ రాజ్యంలో, ఎవ‌ర‌న్న‌ ప‌ట్టించుకున్న‌డా..? ఇంకా వాళ్ల తెలివికి ఏం చేసిండ్రు అంటే ఈ రెండు న‌దుల మీద చెక్ డ్యాంలు క‌ట్టొద్ద‌ని బ్యాన్ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రోజు రెండు న‌దుల మీద చెక్ డ్యాంలు క‌డితే అవి ఇప్పుడు జీవ‌న‌దుల్లా పారుతున్నాయన్నారు. హ‌ల్దీ వాగుకు అయితే కాళేశ్వ‌రం నీళ్లు పోసి ఎండ‌కాలంలో మ‌త్త‌ళ్లు దూకడంతో బ్ర‌హ్మాండంగా పంట‌లు పండుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఒక‌సారి పిల్లుట్ల కాల్వ‌ అయిపోయింది అంటే బ్ర‌హ్మాండ‌మైన నీటి పారుద‌ల వ‌చ్చి న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రైతులు మంచి పంట‌లు పండిస్థారన్నారు. పిల్లుట్ల కాల్వ అయిపోతే నేనొచ్చి కొబ్బ‌రికాయ కొట్టి నీళ్లు తీసుకువ‌స్తాను. ఆ బాధ్య‌త నాదే అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

సునీతను గెలిపిద్దాం: మదన్ రెడ్డి

సీఎం నాపై బాధ్యత పెట్టారు... సునీతా రెడ్డిని నర్సాపూర్ ఎమ్మెల్యేగా గెలిపిద్దామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బేధాలు పక్కన పెట్టి పనిచేద్దాం అన్నారు.