తెరుచుకున్న శబరిమల ఆలయం

తెరుచుకున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. రేపటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, డిసెంబర్ 27న మండల పూజ నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు మకరజ్యోతి పూజలు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 15న సాయంత్రం మకరజ్యోతి దర్శనమివ్వనుంది.