రేవంత్‌రెడ్డీ.. నోరు అదుపులో పెట్టుకో

- బీసీలపై అహంకారపు మాటలు మానుకో
- జనగామలో పల్లా గెలుపు ఖాయం
- బీఆర్‌ఎస్ నేత బక్క నాగరాజు యాదవ్
ముద్ర ప్రతినిధి, జనగామ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, బీసీల పట్ల అహంకారపు మాటలు మానుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని బీఆర్‌ఎస్ నేత బక్క నాగరాజు యాదవ్ హెచ్చరించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. గురువారం జనగామలోని పొన్నాల కార్యాలయంలో సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డికి బీసీలంటే ఎప్పటికీ చిన్నచూపే అన్నారు. నాలుగు పార్టీలు మారి పాతివ్రత్యం చెడిపోయింది రేవంత్‌రెడ్డే తప్ప.. పొన్నాల కాదన్నారు. 45 ఏళ్లు పార్టీ సేవ చేసిన తమ నేత అవమానభారంతోనే బయటకు వచ్చారన్నారు. పొన్నాల ఆశీర్వదంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధిక మెజార్టీతో గెలుపొందడం ఖయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ సుంకరనేని రఘు, సీనియర్ నాయకులు ఆకుల సతీష్, చింతకింది మల్లేష్, ఎండీ మాజీద్ సౌడ మహేష్, రఘు ఠాకూర్, కొలనుపక శివరాజ్, ఈగం శ్రీను కొండా కిరణ్, రాము తదితరులు పాల్గొన్నారు.