జనగామలో కాంగ్రెస్ సంబురాలు

జనగామలో కాంగ్రెస్ సంబురాలు

ముద్ర ప్రతినిధి, జనగామ : కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై జనగామ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు జనగామ చౌరస్తాలో పటాకులు కాల్చి, స్వీట్స్ పంచి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ, జిల్లా నాయకులు ఉడుత రవి, జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్,   ఎన్ఎస్ యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు జక్కుల వేణు మాధవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కిసర దిలీప్ రెడ్డి, ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకులు చింతకింది మల్లేష్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు లోక్కుంట్ల ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీద్ తదితరులు పాల్గొన్నారు.

 కొమ్మూరి వర్గీయుల ఆధ్వర్యంలో..

జనగామ పట్టణం నెహ్రూ పార్క్ వద్ద కొమ్మూరి వర్గీయులు టపాసులు కాల్చి  స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ జిల్లెల సిద్దారెడ్డి,  PACS వడ్లకొండ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, డీసీసీ కార్యదర్శి గంగం నర్సింహారెడ్డి, పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షడు మోటే శ్రీనివాస్, సీనియర్ నాయకులు లింగాల నర్సిరెడ్డి, బొట్ల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.