జూనియర్ పంచాయితీ కార్యదర్శి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే

జూనియర్ పంచాయితీ కార్యదర్శి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు లింబాద్రీ

మెట్‌పల్లి ముద్ర: వరంగల్ జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరీ సోని ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. ప్రభుత్వం గత 11 రోజులుగా జూనియర్ సెక్రటరీలు సమ్మె చేస్తున్న పట్టించుకోకుండా. ఉద్యోగాల నుండి తొలగిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేయడంతో. ఉద్యోగ భద్రత కోసం జూనియర్ సెక్రెటరీ సోనీ ఆత్మహత్య చేసుకున్నదని.

సోనీ ఆత్మహత్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ ఆమె కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా అందజేయాలని. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి కోలా రాములు, నియోజకవర్గ అధ్యక్షుడు గోరుమంతల ప్రభాకర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ బత్తుల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు రాందాస్, సామర్ల కళ్యాణ్, లింగన్న లు ఉన్నారు.