ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం ... ఎమ్మెల్యే రాజయ్య

ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం ... ఎమ్మెల్యే రాజయ్య

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: రాష్ట్ర ప్రజల సమగ్ర ఆరోగ్య పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే డా.రాజయ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావాలలో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుడు దేవుడితో సమానం వైద్యవృత్తిలో ఉన్న మనందరికీ మానవత, సామాజిక బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. కరోనా కష్టకాలంలో వైద్య వృత్తిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారని కొనియాడారు. మానవసేవే మాధవసేవ గా భావించాలన్నారు.

ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు సంపూర్ణ భోజనం అందించడం మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షనే ధ్యేయంగా ఆరోగ్యం మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మధుమేహం, ఎనీమియా క్యాన్సర్ నిర్ధారణ, పౌష్టికార లోపాన్ని గుర్తించడం, రక్తపోటు, సర్వేకల్ , థైరాయిడ్ పరీక్ష , సూక్ష్మ లోపాలను గుర్తించడం , అయోడిన్ సమస్య , పోలిక్ యాసిడ్ , ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బి12, విటమిన్ డి వంటి 57 రకాల టెస్టులు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ సుధీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, ఏసీపీ రఘు చందర్ తాసిల్దార్ పూల్ సింగ్ చౌహన్, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, జడ్పిటిసి మారపాక రవి, సర్పంచ్ తాటికొండ సురేష్, ఎంపీటీసీలు దయాకర్, రాజు అక్కనపల్లి బాలరాజు మెడికల్ ఆఫీసర్ సంధ్య, డాక్టర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.