వర్గీకరణ చేయకుంటే బిజెపిని చిత్తుగా ఓడిస్తాం.. మంద కృష్ణ మాదిగ

వర్గీకరణ చేయకుంటే బిజెపిని చిత్తుగా ఓడిస్తాం.. మంద కృష్ణ మాదిగ

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: వర్గీకరణ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం త్వరలో హైదరాబాదులో జరిగే విశ్వరూప మహాసభ సన్నాహక సమావేశం బొట్ల మహేష్ అధ్యక్షతన జరిగింది. ప్రజా యుద్ధనౌక గద్దర్ అకాల మరణం పట్ల మౌనం పాటించి నివాళులర్పించి నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాట్లాడుతూ జులై 8న వరంగల్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ వర్గీకరణకు హామీ ఇచ్చారని సాధారణ ఎన్నికలలోపే వర్గీకరణ సాధించుకునేందుకు ఎమ్మార్పీఎస్ నాయకులు విశ్వరూప మహాసభ  విజయవంతానికై  మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. అనంతరం మంద క్రిష్ణ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు చట్టబద్ధత మాదిగల, ఉపకులాలకు సన్నద్ధం చేసే విధంగా భారీ యెత్తున మాదిగల విశ్వరూపం సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై ఎన్నికల వేళ ఒత్తిడి తెస్తే, రాబోయే వందల తరాల భవిష్యత్తుకు ఉపయోగకరమని అన్నారు. ఇప్పటికీ 273 సభగా నేటితో నిర్వహించినట్లు తెలిపారు.  నవంబర్ నెలలో పూర్తిగా ఎన్నికలు పూర్తి అవుతాయని, ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే తాడో పేడో తేల్చుకుందమని అన్నారు.  ఎజెండా మోస్తే ఆ లీడర్ బాగుపడ్తరని, ఎమ్మార్పీ జండా మోస్తే మాదిగలు ఉప కులాలు బాగుపడతాయి అన్నారు. ఇంటికో ఉద్యోగం అని రాష్ట్రంలో కేసీఆర్ గద్దెనెక్కి ఆయన కుటుంబానికే పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. 50ఏండ్లుగా విద్య, ఉద్యోగ రంగాల్లో, సంక్షేమ పథకాలల్లో అన్యాయం జరిగిందని అన్నారు. మాదిగలు రాజకీ అవకాశాలు అప్పుడేమో అడిగేటోడు లేరని, ప్రస్తుతం ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ రచ్చ కెక్కుత్నున్న పరిస్థితి 119 నియోజక వర్గాల్లో కేవలం స్టేషన్ ఘన్ పూర్ లో ఉన్నదని అన్నారు. మాదిగ దండోరాకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్యామ్, జిల్లా కన్వీనర్ పైసా రాజశేఖర్,  కొయ్యడ మల్లేష్, బొడ్డు దయాకర్, విజయ్, సురేష్, ఇసాక్, యాకూబ్, శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు.