రక్షణ కవచాలు లేకుండా కేజివీల్స్ నడిపితే చర్యలు - డిటిఓ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

రక్షణ కవచాలు లేకుండా కేజివీల్స్ నడిపితే చర్యలు - డిటిఓ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక


ముద్ర ప్రతినిధి, మెదక్:రక్షణ కవచాలు లేకుండా కేజివీల్స్ ట్రాక్టర్లను తారు రోడ్డుపై తిప్పితే  తగిన చర్యలు తప్పవని, అలాంటి ట్రాక్టర్లపై కేసు నమోదు చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి జీవి శ్రీనివాస్ గౌడ్  హెచ్చరించారు. భారీ జరిమానా కూడా విధిస్తామన్నారు. రక్షణ కవచాలను బిగించిన తర్వాతే కేజివీల్స్ ట్రాక్టర్లను రోడ్లపై తిప్పాలన్నారు. కేజివీల్స్ కు రబ్బరు, ఐరన్ పాడ్లు విధిగా బిగించాలని, అలా బిగించడం వల్ల రోడ్డు ధ్వంసం కాకుండా ఉంటుందన్నారు. కేజివీల్స్ ట్రాక్టర్లపై ప్రత్యేక నిఘా చేపడతామని డిటిఓ పేర్కొన్నారు.