సీఎం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు

సీఎం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు
  • ప్రారంభోత్సవాలు, భారీ బహిరంగ సభ

ముద్ర ప్రతినిధి, మెదక్:19న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మెదక్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ భవనంతో పాటు ఎస్పీ ఆఫీస్, బిఆర్ఎస్ భవన్ ప్రారంభించనున్న నేపధ్యంలో జరుగుతున్న పనులను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతపై అధికారులకు తగు సూచనలు చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఇతర ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు.

ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.ప్రారంభోత్సవాల అనంతరం జరిగే బహిరంగ సభకు మెదక్ జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేస్తామన్నారు. మెదక్ జిల్లా కావాలని ఎన్నో ఏళ్ళ కల, ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారన్నారు. మెదక్ పట్టణం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. అన్ని వైపులా 4 లైన్ రోడ్స్, జాతీయ రహదారి పనులు వంటి అన్ని కార్యక్రమాలు వేగంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతున్నాయన్నారు.