ఓటరు చైతన్య రథం  ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఓటరు చైతన్య రథం  ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
  • పోలింగ్ కేంద్రం సందర్శన

సాధారణ ఎన్నికల సందర్బంగా మెదక్ కలెక్టరేట్ లో ఓటరు చైతన్య రథంను కలెక్టర్ రాజర్షి షా జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో రెండు నియోజక వర్గాల్లో ఓటరు చైతన్య రథం వచ్చి ప్రచారం చేస్తుందని, వంద శాతం  ఓటింగ్ లక్ష్యంగా ప్రచారం చేస్తుందని తెలిపారు.నేను కచ్చితంగా గా ఓటు వేస్తాను అనే  నినాదంతో ప్రజలు అందరూ ఓటింగ్ లో భాగస్వామ్యం కావాలని పిలపునిచ్చారు. ఓటరు చైతన్య రథం జిల్లాలో అక్టోబర్ 28 వరకు ప్రధాన కూడళ్లు, మార్కెట్స్, బస్ స్టాండ్ లు, జాతరలు, షాపింగ్ మాల్స్, కాలనీల్లో తండాలలో ప్రచారం చేస్తుందని, తెలంగాణ  సంస్కతిక శాఖ కళా కారులు అట, పాటలతో ప్రజలకు చైతన్యం కల్గించాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎన్నిక అధికారి, అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డిపిఆర్ఓ ఏడు కొండలు, కళా కారులు తదితరులు పాల్గొన్నారు.

పిఎస్ సందర్శన

మెదక్ నియోజక వర్గంలోని నిజాంపేట్ మండలo నందిగామ గ్రామన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల అయినందున ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ సురేష్ కుమార్, ఈఈ  నర్సింలు, డిఈ పాండురంగా రెడ్డి, బిఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.