భువనగిరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం

భువనగిరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం

భువనగిరి ఆగస్టు 14 (ముద్ర న్యూస్):- భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికలలో గెలిపిస్తామని భువనగిరి మండలంలో గ్రామ శాఖ అధ్యక్షుల మరియు మండల కార్యవర్గ సన్మాన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం తెలిపారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని చిక్కుల వెంకటేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని ఎంతోమంది వస్తు పోతూ ఉంటారని పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అదేవిధంగా కేంద్రంలో రాహుల్ గాంధీ  నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కార్యకర్తలు ఎవరు కూడా ఇతర పార్టీల ప్రలోభాలకు గురికాకుండా పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం సైనికులుగా పనిచేయాలని క్షేత్రస్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంలో ఎవరికి అవకాశం కల్పించిన వారి గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు.

మండల నాయకులు వల్లందాసు ఆదినారాయణ మాట్లాడుతూ గ్రూపులకు అతీతంగా పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు, ఈ సందర్భంగా మండలంలోని 34 గ్రామ శాఖ అధ్యక్షులకు మరియు మండల కార్యవర్గానికి భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం  సమక్షంలో వారికి సన్మానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లందాసు ఆదినారాయణ,ఎడ్ల శ్రీనివాసు, కోట మహేందర్, చుక్క స్వామి, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు చిన్న బత్తిని స్వరూపారని, మండల అధ్యక్షురాలు పిట్టల రజిత, నల్ల లహరి, వర్కింగ్ అధ్యక్షులు పాశం శివానంద్, మంగ ప్రవీణ్,  చిన్నం శ్రీనివాస్, ఓరుగంటి ఆంజనేయులు, పిట్టల వెంకటేశం, గంగాదేవి రవి, మచ్చ పాండు, తుమ్మేటి వెంకటేశం, స్వామి, ఏడు మేకల మహేష్, విటల్ వెంకటేశం, ఎర్ర మహేష్, ఐలయ్య, బాలయ్య, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు