అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు, బిసిలకు బిసి లోన్ల ను వర్తింపజేయాలని డిమాండ్

అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు, బిసిలకు బిసి లోన్ల ను వర్తింపజేయాలని డిమాండ్

వలిగొండ (ముద్ర న్యూస్) : వర్కట్ పల్లి గ్రామంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబాలకు దళిత బందు, బి.సి లకు లోన్లు మంజూరు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు  లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభ ద్వారా జరపాలని పంచాయితీ కార్యదర్శి కి వినతిపత్రం అందజేశారు. ఈ  సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ వరకట్పల్లి గ్రామంలో అనేక దళిత కుటుంబాలు ఉన్నప్పటికీ కేవలం ఎనిమిది మందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా లబ్ధిదారులుగా గుర్తించడం దళితులందరినీ మోసం చేయడమేనని వెంటనే గ్రామానికి మంజూరైన యూనిట్లను అన్ని దళిత కుటుంబాలకు వర్తించే విధంగా దళిత బందును పంపిణీ చేయాలని దళితులు డిమాండ్ చేశారు. వరకట్పల్లి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో మార్పు వస్తుంది అనుకుంటే కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా లబ్ధిదారుల ఎంపిక జరగడం మిగతా దళితులందరినీ మోసం చేయడమేనని అన్నారు. అదేవిధంగా బీసీ లక్ష రూపాయల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీ కుటుంబానికి లక్ష రూపాయల రుణాలను అందించాలని డిమాండ్ చేశారు.

లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా జరగడం వల్ల నిజమైన పేదలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని కానీ గ్రామసభలకు సంబంధం లేకుండా చాటుమాటు వ్యవహారంతో ఎవరు ప్రజాప్రతినిధులు ఉంటే వారి అనుచరులకు ఇచ్చే విధంగా వ్యవహరించే పద్ధతులు మానుకోవాలని దీనిపై స్థానిక శాసనసభ్యులు జోక్యం చేసుకోవాలని లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో వారికి తీవ్రమైన నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు సిర్పంగి స్వామి, మాడుగుల గిరి, గ్రామానికి చెందిన దళితులు, బిసిలు  మీసాల శంకరయ్య, కందుకూరి స్వామి, పల్లెర్ల అంజయ్య, బంగారు మైపాల్, మీసాల యాదయ్య, మీసాల మల్లయ్య, బంగారు నరసింహ, మీసాల వాసుదేవ్, గుర్రం సుధీర్, బరిగల వెంకటేష్, మీసాల నర్సింహ, శ్రీహరి, రాములు, పార్వతమ్మ, మీసాల అండాలు, మీసాల నరసమ్మ, మీసాల అరుణ, మీసాల మంజుల, కిన్నెర  లక్ష్మయ్య, మీసాల ప్రవీణ్, వినోద్,  వంశీ, తదితరులు పాల్గొన్నారు.