ఆడ బిడ్డల నీటి కష్టాలు తీర్చింది కెసిఆర్

ఆడ బిడ్డల నీటి కష్టాలు తీర్చింది కెసిఆర్

24 గంటల కరెంటుతో రాజైన రైతు

బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆడ బిడ్డల నీటి కష్టాలు తీర్చేందుకు ఇంటింటికి నల్ల బిగించించింది సీఎం కెసిఆర్ అని మెదక్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. 24 గంటల కరెంటుతో రైతులు రాజయ్యారని పేర్కొన్నారు. సోమవారం నిజాంపేట మండలం చెల్మెడ నందిగామ, బచ్చురాజ్ పల్లి, షౌకత్ పల్లి, వడ్డెర కాలనీ, తిప్పన్నగుల్ల, వెంకటాపూర్. కె,రజాక్ పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చల్మెడ గ్రామంలో బోనాలు, బతుకమ్మ, మంగళ హారతులు, సంప్రదాయ వలలతో ఘన స్వాగతం మహిళలు, ముదిరాజ్ కులస్తులు, బెస్త కులస్తులు, గ్రామస్తులు స్వాగతం పలికారు.

గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించారు. కుటుంబానికి ఒక పెద్ద కొడుకు లాగా వృద్ధులకు ఆసరా పెన్షన్ అందించిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఈ పెన్షన్ మరింత పెరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, దానికి ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నందిగామలో పద్మా దేవేందర్ రెడ్డికి మంగళ హారతులు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బచ్చురాజ్‌పల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దేశంలో 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రైతులు బాగున్నారంటే దానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అని చెప్పారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని దానికి ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. షౌకత్‌పల్లి తండాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం చేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.