అట్టహాసంగా ముగిసిన వార్షిక క్రీడలు.. బహుమతులు అందజేసిన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

అట్టహాసంగా ముగిసిన వార్షిక క్రీడలు.. బహుమతులు అందజేసిన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా అవుసులపల్లి వద్ద నూతన పోలీసు గ్రౌండ్ లో మెదక్ జిల్లా వార్షిక క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. గెలుపొందిన విజేతలకు జిల్లా ఎస్పి  రోహిణి ప్రియదర్శిని బహుమతులు అందజేశారు.  మెదక్, తూప్రాన్ సబ్ డివిజన్, ఏ.ఆర్ హెడ్ క్వాటర్  జట్లు  పాల్గొన్నాయి. ఈ క్రీడా పోటీల్లో బాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్, లాంగ్ జంప్,100 మీటర్ల,200 మీటర్ల  పరుగు పందెం,షార్ట్ పుట్,కబడ్డీ పోటీలు జరిగాయి. లాంగ్ జంప్ విజేతలు  డబుల్ మొదటి బహుమతి  డబుల్ రెండవ  బహుమతి బాడ్మింటన్ విజేతలు సింగిల్స్  మొదటి బహుమతి  కబడ్డీ  తూప్రాన్ సబ్ డివిజన్ జట్టు విజయం సాదించి మొదటి స్థానాన్ని, మెదక్ సబ్ డివిజన్ జట్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 

వాలీబాల్  విజేతలు ఏ.ఆర్ జట్టు విజయం సాదించి మొదటి స్థానాన్ని, మెదక్ సబ్ డివిజన్ జట్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

క్రికెట్ విజేతలు ఏ.ఆర్ జట్టు విజయం సాదించి మొదటి స్థానాన్ని, మెదక్ సబ్ డివిజన్ జట్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

బాడ్మింటన్ విజేతలు డబుల్ మొదటి బహుమతి నాగరాజు కానిస్టేబుల్, ఆంజనేయులు కానిస్టేబుల్ డబుల్ రెండవ బహుమతి దినకర్ కానిస్టేబుల్, కృష్ణ కానిస్టేబుల్, సింగిల్స్ మొదటి  విజేత మెదక్ రూరల్ సి.ఐ.విజయ్, సింగిల్స్ రెండవ విజేత  జి‌.నరేశ్ ఆర్.ఎస్.ఐలు బహుమతులు అందుకున్నారు. 

100 మీటర్ల పరుగు పందెం మొదటి బహుమతి  సాయికుమార్ ఏఆర్పిసి, రెండవ బహుమతి  ప్రభాకర్ ఏఆర్పిసి, 200 మీటర్ల పరుగు పందెం మొదటి బహుమతి సాయికుమార్, రెండవ బహుమతి శ్రీధర్ గౌడ్ క్లూస్ టీం

400 మీటర్ల పరుగు పందెం మొదటి బహుమతి  మహిపాల్ ఆర్ఎస్ఐ, రెండవ బహుమతి కృష్ణ ఏఆర్పిసి, లాంగ్ జంప్  మొదటి బహుమతి  సాయి కుమార్, రెండవ బహుమతి  అంజయ్య

షార్ట్ పుట్ సాయి కుమార్, రెండవ బహుమతి ప్రకాష్ లు కైవసం చేసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో  డి.యెస్.పిలు సైదులు, యాదగిరి రెడ్డి, శ్రీనివాస్, ఆర్.ఐ.లు అచ్యుత రావ్,  నాగేశ్వర్ రావ్, మెదక్ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకట్, సి.ఐలు విజయ్ కుమార్, జార్జ్, షేక్ లాల్ మదర్, శ్రీదర్ గారు, జిల్లాలోని ఎస్.ఐ లు, ఆర్.యెస్.ఐలు నరేశ్,భవానీ కుమార్, మహిపాల్, సుభాష్,  పిడి, పిఈటిలు మాధవరెడ్డి, శ్రీనివాసరావు, మధుసూదన్, దేవేందర్ రెడ్డి, వినోద్ కుమార్, మధు, జిల్లా పోలీసు క్రీడాకారులు పాల్గొనారు.