ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి - ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న కలెక్టర్ షా, ఎస్పీ రోహిణి

ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి - ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న కలెక్టర్ షా, ఎస్పీ రోహిణి

ముద్ర ప్రతినిధి, మెదక్: రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు,  ప్రజలలో ఆత్మ విషయాన్ని విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు.  మెదక్ జిల్లా శివంపేటలో  కేంద్ర బలగాలు,  జిల్లా పోలీసు సిబ్బందితో  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించగా  జిల్లా కలెక్టర్  రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్  శివంపేట పోలీస్ స్టేషన్ నుండి తహసీల్దార్ ఆఫీస్, గ్రామపంచాయతీ కార్యాలయం, రైస్ మిల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  వద్ద ముగిసింది. అక్కడి నుండి దొంతి కొంతాన్పల్లి, గోమారంలో సైతం ర్యాలీ నిర్వహించారు.  కేంద్ర బలగాలు రెండు కంపెనీలు,  మెదక్ జిల్లా రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, క్వూఆర్టి, హోంగార్డ్ ఆఫీసర్స్  ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా ఎస్.పి. మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ... ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రజలలో నమ్మకాన్ని కలిగించడానికి ఈ పోలీస్ ఫ్లాగ్ మార్చ్ అనేది నిర్వహించబడుతుందన్నారు. దీని ద్వారా ఎలక్షన్లు శాంతియుతంగా సక్రమంగా  జరుగుతాయని ప్రజలలో ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డి.ఎస్.పి. యాదగిరి రెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో బి. శ్రీనివాసులు, తూప్రాన్ సీఐ శ్రీధర్, శివంపేట తహసీల్దార్ శ్రీనివాస చారి, శివంపేట ఎస్.ఐ రవికాంత్ రావు, ఆర్.ఎస్.ఐలు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.