రెండు మున్సిపాలిటీలకు రూ.40 కోట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రెండు మున్సిపాలిటీలకు రూ.40 కోట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ మున్సిపాలిటీకి 20 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు అయినట్లు ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి వెల్లడించారు. మంజూరు
శనివారం మెదక్ క్యాంప్ కార్యాలయంలో  మీడియా సమావేశంలో మంజూరు ఉత్తరువులు వచ్చినట్లు వివరించారు. రెండు మున్సిపాలిటీలలో అవసరం ఉన్న చోట ఔట్ లెట్స్, డ్రైన్స్, సీసీ రోడ్స్ , రోడ్ల మరమ్మతులు మిషన్ భగీరథ ద్వారా ధ్వంసం అయిన రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని  కోరారు.

ఎంఎన్ కెనాల్ పొంగిపొర్లడం వలన సాయి నగర్ కాలనిలో వరద నీళ్లు వచ్చాయని వచ్చే సంవత్సరం నాటికి కాలనీ లోకి నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చేసేలా చర్యలు చేపడతామన్నారు.
వర్షాకాలం వ్యాధులు ప్రజలే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మెదక్ నియోజకవర్గంలో ఏడు డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మెదక్ పట్టణంలో నాయక్ చెరువు ప్రమాద హెచ్చరిక ఉందని వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్,  కౌన్సిలర్ జయరాజ్, మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, రైతుబంధు అధ్యక్షులు కిష్టయ్య, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డమీది. కృష్ణ గౌడ్, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి తదితరులు ఉన్నారు.