సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న  బీఆర్ఎస్

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న  బీఆర్ఎస్
  • సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలో బీఎస్పీ లోకి భారీ చేరికలు 
  • బీఎస్పీ సూర్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందరికీ అందించ లేకున్నా వాటిని అందరికీ ఇస్తున్నామని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి బీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నీ ప్రజలను మోసం చేస్తుందని బహుజన సమాజ్ పార్టీ సూర్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ విమర్శించారు. సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలో బిఆర్ఎస్,కాంగ్రెస్,బిజెపి పార్టీలకు రాజీనామా చేసి 600 మంది కార్యకర్తలు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్  శుక్రవారం పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని చెప్పిన కెసిఆర్ ప్రభుత్వం ఇమాంపేట గ్రామంలో దళితుల భూములు లాక్కొని మిషన్ భగీరథ  కార్యాలయాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కూలి పనులు చేసుకుని కూడబెట్టుకున్న సొమ్ముతో భూములు కొనుక్కున్న దళితుల భూములలో డంపింగ్ యార్డ్ చేపడుతుంటే వద్దని వారించానని అన్నారు.

దళిత బంధు, బీసీ బందు పేరుతో బహుజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని ఎద్దేవా చేశారు. గత 20 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న బీసీ,ఎస్సీ ,ఎస్టి,మైనార్టీ,కులాల అభివృద్ధి కోసమే తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు.  బహుజనల అంత ఏకమై అగ్రకులాల నాయకులను ఓడించి బీసీ బిడ్డను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందన్నారు. అగ్రకులాల నాయకుల నుంచి విముక్తి పొందాలంటే ఏనుగు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇమాంపేట ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిస్తే దళితుల భూములు తిరిగి వెనక్కి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

బీఎస్పీ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాగిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, బీ ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కుంచం ఉపేందర్, గ్రామ వార్డు మెంబర్ సొప్పరి నాగమణి లాలయ్య, నగిరి వెంకటమ్మ అంజయ్య, మాజీ వార్డు సభ్యులు నగిరి అంజయ్య, సాగాల సోమమ్మ, సొప్పరి నాగమ్మ, డప్పు కళాకారుడు సామల కృష్ణయ్య, సర్దార్ నగేష్ చలక రవి, సతీష్ హరీష్ తోపాటు 600 మంది పార్టీలో చేరారు.
 ఈ కార్యక్రమంలో కుంభం వెంకన్న, నరిగె అన్వేష్ లింగాల సైదులు రావుల కృష్ణయ్య జిల్లా ప్రధాన కార్యదర్శిమామిడి స్టాలిన్ దాసరి సతీష్ సొప్పరి శివ బోయ సైదులు, బోల్క రవి వీరబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.