ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు పుట్ట మధును ఆదరించండి - పుట్ట శైలజా

ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు పుట్ట మధును ఆదరించండి - పుట్ట శైలజా

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  ప్రజలకు అందుబాటులో ఉండే నాయకున్ని ఎం.ఎల్.ఏ గా ఎన్నుకోవాలని మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజా అన్నారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ఏర్పాటు చేసిన బి.అర్.ఎస్ మానిఫెస్టో పై మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో  శైలజ పాల్గోని కేసీఆర్ పథకాలను వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవకు అంకితమవుతున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్ ను గెలిపించాలని  అమే కోరారు. ప్రతి ఇంటికి ఉచిత రూ.5 లక్షల ఇన్సూరెన్స్, మహిళలకు రూ. 3 వేలు గౌరవ బృతి, గాస్ సిలిండర్ రూ. 4 వందలకు, రూ.16 వేలు రైతు బంధు పెంపు, అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, ఇతరులకు రూ. 5 వేల పెన్షన్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 15 లక్షలకు పెంచడం, మహిళ సంఘాలకు భవన నిర్మాణం చేస్తారని అమే తెలిపారు. దీనికి తోడు ఇప్పుడున్న గృహలక్ష్మి, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, దళిత బందు, బి.సి బంధు,కేసీఆర్ కిట్టు ఇతర పథకాలు యథావిధి గా కొనసాగుతాయని అన్నారు. మంథనిలో మీరు ఓటు వేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్కడైనా కనిపిస్తున్నాడా! మీకు అందుబాటులో ఉంటున్నాడా! అన్నారు. మంథని నియోజకవర్గం లో ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి జరగాలంటే కచ్చితంగా కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మ్యాదరవేన శారద కుమార్, మండల అధ్యక్షుడు శేంకేసి రవీందర్, వైస్ ఎంపీపీ కాపరాబోయిన శ్రీదేవి భాస్కర్, ఉప సర్పంచ్ దుబ్బాక సత్య రెడ్డి,దామెర శ్రీనివాస్, మాజీ కొండగట్టు డైరెక్టర్ జక్కుల దామోదర్ రావు, బీఆర్ఎస్ అధ్యక్షుడు భాద్రపు ప్రశాంత్ రావు, వార్డ్ సభ్యులు కెక్కర్ల ఉష, ప్రధాన కార్యదర్శి సందేవేన కుమార్, బర్ల శ్రీకాంత్, ముడుసు భారతి, మాజీ ఎంపీటీసీ మద్దెల ఓదేలు, ధర్ముల శ్యామల, బోగే సతీష్, తదితరులు పాల్గొన్నారు.