బీఆర్‌ఎస్‌లోకి భారీగా  యువకుల చేరిక... కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పుట్ట మధు

బీఆర్‌ఎస్‌లోకి భారీగా  యువకుల చేరిక... కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పుట్ట మధు

ముద్ర ముత్తారం: ముత్తారం మండలానికి చెందిన పెద్ద ఎత్తున యువకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ముత్తారం గ్రామానికి చెందిన సుమారు 50 మంది  యువకులు, కార్యకర్తలు శుక్రవారం మంథని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు  సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి మధు ఆహ్వనించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృధ్ది, సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.  నియోజకవర్గంలో ఫుట్ట మధు చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఆయనకు అండగా నిలువాలని బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు యువకులు ప్రకటించారు.  నియోజకవర్గ అభివృధ్ది, ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న పుట్ట మధను ఈ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు,  బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.