SGF  రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు మంథని షోటోకాన్ క్రీడాకారులు ఎంపిక

SGF  రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు మంథని షోటోకాన్ క్రీడాకారులు ఎంపిక

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని  గోదావరిఖని ఎన్.టి.పి.సి, టి.వి గార్డెన్ లో  ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ కరాటే సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్ కి ముఖ్య అతితులుగా పెద్దపల్లి జిల్లా ఎస్ జి ఫ్ సెక్రెటరీ కోమురోజు శ్రీనివాస్ మరియు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ మానస అనుతం రెడ్డిలు హాజరయ్యారు. విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు కరాటే నేర్చుకోవటం వల్ల ధైర్యంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉధ్యోగాలు వస్తాయి అన్నారు. ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ కు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుండి 200 కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. మంథని షోటోకాన్ కరాటే మాస్టర్ కోoడ్ర నాగరాజు విధ్యారులు ముగ్గురు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపిక అయ్యారు.  

అండర్ 17 , - 35 కె.జి విభాగంలో లో బీర ఆదిత్య తేజ ( గోల్డ్ ), - 52 కె.జి విభాగంలో దొంతుల సాయి దివ్య తేజస్విని ( గోల్డ్ ),  అండర్ 14, - 42 కె.జి విభాగంలో లో  వడ్లకొండ శ్రీనిత  ( గోల్డ్ ), - 25 కె.జి లో పి.శ్రీరాజ్  ( సిల్వర్) మెడల్స్ సాధించారు. 

నల్గొండ లో జరగపోయే రాష్ట్ర స్థాయి  కరాటే లో వీరు పాల్గొంటారు. సెలక్ట్ అయిన విద్యార్థులను మరియు మాస్టర్ కోండ్ర నాగరాజు లను జే.కె.ఏ  సౌత్ జోన్ ఇంఛార్జి రాపోలు సుదర్శన్, జోనల్ ఇంఛార్జి నూకల బానయ్య, సీనియర్ మాస్టర్స్ పర్ష బక్కయ్య, శంకర్ గౌడ్ అభినందించారు.