ఆదివారంపెటలో 6 గ్యారంటీల గురించి వివరిస్తూ ఇంటింటా తిరుగుతూ ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబును గెలిపించాలని ప్రచారం 

ఆదివారంపెటలో 6 గ్యారంటీల గురించి వివరిస్తూ ఇంటింటా తిరుగుతూ ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబును గెలిపించాలని ప్రచారం 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రామగిరి మండలపరిధిలోని ఆదివారంపేట  గ్రామ శాఖ అధ్యక్షులు మైదం బుచ్చయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆరు గ్యారంటీల కార్డులతో పాటు మంథని ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు ను గెలిపించాలని  ప్రజలకు వివరించారు.  వారు ఇంటింటికీ తిరిగి మాట్లాడుతూ తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల ప్రతి మహిళకు ప్రతి నెల రూపాయలు 2500, లు 500 కి గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసా పథకం, కింద ప్రతి రూ.15000 లు రూ 12000, లు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు వరి పంటకు రూపాయల 500 బోనస్.

గృహ జ్యోతి పథకం,  ప్రతి ఇంటికి అవసరాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇంటి పథకం, ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 5 లక్షలు అందించనున్నారు. యువ వికాస పథకం కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు,
చేయూత పింఛన్* ఆసరా పెన్షన్ 4,000/- రూపాయలకు పెంపు కల్పించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండలం మాజీ జడ్పీటీసీ లు నాగినేని జగన్ మోహన్ రావు, మైదం భారతివర ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ రామగిరి మండలం అధ్యక్షుడు రొడ్డ బాపన్న, మంథని అసెంబ్లీ యూత్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్,  సీనియర్ నాయకులు వనం రామచంద్రరావు,  అట్టే తిరుపతి రెడ్డి, వేపాచేటు రాజేశం, కన్నురి నరసింగ్, గోడిశాల సంతోష్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, అరెల్లి సాయిలు, ఎలువక కిరణ్ కళ్లెం కిషన్ రెడ్డి కొమ్ము మండయ్ చెవుల కోటేష్ కన్నురి ఓదెలు గోడిశాల కమలాకర్ కన్నురి శ్రీకాంత్ గోడిశాల మల్లేష్ చిప్పకుర్తి స్వామి కాదశి రమేష్ కన్నురి ప్రశాంత్ ఇల్లందుల రాజు కుర్రె కొమురయ్య, కొమ్ము రాజకొమురయ్య మెండ ఓదెలు మేకల ఓదెలు  తదితరులు పాల్గొన్నారు.