పార్వతి బ్యారేజ్ చెక్ పోస్ట్ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా

పార్వతి బ్యారేజ్ చెక్ పోస్ట్ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
  • పార్వతి బ్యారేజీ గోదావరినది నుంచి ట్రాక్టర్ల ద్వారా రాత్రిపూట ఇసుక రవాణా చేస్తూ సిరిపురం సమీపంలో డంప్ చేస్తున్న ఇసుక మాఫియా గాల్లు...
  • హైదరాబాదు నుండి మంథని కి  వస్తున్న లారీల ద్వారా అక్రమ ఇసుక రవాణా తరలింపు

 
ముద్ర ప్రతినిధి, పెద్దపెల్లి: మంథని మండలం సిరిపురం సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన పార్వతి బ్యారేజీ గేట్ల కింది భాగంలోకి రాత్రిపూట ట్రాక్టర్లు వెళ్లి గోదావరినదిలో అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. గోదావరినదిలోకి వెళ్లకుండా పార్వతి బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను సిరిపురం సమీపంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో డంపు చేసి, అక్కడి నుండి అర్ధరాత్రి లారీల ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి పూట జరుగుతున్న ఇసుక మాఫియా వెనకాల ఎవరైనా పెద్ద వాళ్ళు ఉన్నారా... అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి... అధికారుల కన్నుగప్పి ఇసుక మాఫియా గాళ్లు చేస్తున్న అక్రమ రవాణాను వెంటనే అధికారులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.