కమిషన్ల కల్వకుంట్ల కవిత రాకతో కాంగ్రెస్ కు పెరిగిన మరింత ఆదరణ...

కమిషన్ల కల్వకుంట్ల కవిత రాకతో కాంగ్రెస్ కు పెరిగిన మరింత ఆదరణ...
  • మంథనిలో శ్రీధర్ బాబు అభివృద్ధి అభివృద్ధి లిక్కర్ స్కాం కవితకు కనబడక పోవడం సిగ్గుచేటు...
  • ముత్తారం మాజీ జెడ్పిటిసిలు నాగినేని జగన్మోహన్ రావు, చొప్పరి సదానందం

ముద్ర ముత్తారం : లిక్కర్ స్కామ్, సింగరేణిలో  అవినీతి అక్రమాలతో అడ్డంగా దొరికిపోయిన కమిషన్ల కల్వకుంట్ల కవిత మంథని రాకతో కాంగ్రెస్ పార్టీకి మరింత ఆదరణ పెరిగి శ్రీధర్ బాబు భారీమెజార్టీ తో గెలుస్తున్నాడని, మంథనిలో శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధి పనులు కవితకు కనిపించకపోవడం సిగ్గుచేటని,  ముత్తారం మాజీ జడ్పిటిసి లు నాగినేని జగన్మోహన్ రావు, చొప్పరి సదానందం లు అన్నారు. మంగళవారం ముత్తారం ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో వారు కలిసి మాట్లాడుతూ  మంథని లో మతిభ్రమించిన కవితకు కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధి కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. మా నాయకుడు మంథనిలో చేసిన అభివృద్ధికి మేము చర్చకు సిద్ధమే... మీ నాయకుడు సిద్ధమా అని వారు సవాల్  విసిరారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో దొరికి జైలుకు వెళ్లకుండా ప్రధానమంత్రి మోడీ కాలు మొక్కి తెలంగాణ మహిళల గౌరన్ని అపప్రదం చేసిన కవితకు శ్రీధర్ బాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ తమ బుల్లెట్ అని చెప్పుకోవడం వెనుక ఆ బుల్లెట్టు చేసే పని అవినీతి అక్రమాలు సంపాదించడంతో  పాటు హత్యలు చెయ్యడానికేనా అని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం సర్పంచ్ తుటి రజిత రఫీ, మండల యూత్ అధ్యక్షులు బియ్యని శివకుమార్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాధం శ్రీను, నాయకులు  తాటిపాముల శంకర్, బుచ్చం రావు, లక్కం ప్రభాకర్, రాపెళ్లి రామన్న, కొల విజయ్, జక్కుల రమేష్, వేల్మారెడ్డి సంజీవరెడ్డి, గూట్ల రవీందర్, బైరి రాజు, సెగ్గం వంశీ, వీరగోని అంజి,  బోడ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.