రామగుండం కమిషన్ రేట్ లో భారీగా ఎస్ఐల బదిలీలు..

రామగుండం కమిషన్ రేట్ లో భారీగా ఎస్ఐల బదిలీలు..

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:-రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నాడు భారీగా ఎస్ఐలను బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాలేశ్వరం ఎస్సైగా పనిచేస్తున్న లక్ష్మణ్ రావును పెద్దపల్లికి బదిలీ చేయగా, పెద్దపల్లి లో పనిచేస్తున్న మహేందర్ ను ములుగు జిల్లాకు, సుల్తానాబాద్ ఎస్సై గా ఉన్న జి అశోక్ రెడ్డిని పొత్కపల్లి పోలీస్ స్టేషన్కు, అక్కడ పనిచేస్తున్న ఎన్ శ్రీధర్ ను జూలపల్లి పోలీస్ స్టేషన్ కు, జూలపల్లి లో పనిచేస్తున్న వెంకట కృష్ణ ను రామగుండం వి ఆర్ కు, ములుగు విఆర్ లో ఉన్న ఓంకార్ యాదవ్ ను కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అలాగే కాల్వ శ్రీరాంపూర్ లో ఉన్న టి శ్రీనివాస్ ను రామగుండం కమిషనరేట్ వి ఆర్ కు, తాండూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా ఉన్న రాజశేఖర్ ను మందమర్రి కి, మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఎస్సై -2 విధులు నిర్వహిస్తున్న రాజేందర్ ను కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు, అక్కడ పనిచేస్తున్న జి సురేష్ ను రామగుండం కమిషనరేట్ వి ఆర్ కు, కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న బెతీ రాములు ను భీమారం పోలీస్ స్టేషన్ కు, అక్కడ పనిచేస్తున్న రాజ్య వర్ధన్ ను రామగుండం కమిషనరేట్ వి ఆర్ కు బదిలీ చేస్తూ ఐజీ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు.