బాలికా సాధికారత..పరుగుతో చేయూత !

బాలికా సాధికారత..పరుగుతో చేయూత !
  • ఉత్సాహంగా సాగిన సేవా భారతి "రన్ ఫర్ గర్ల్ చైల్డ్" 2024
  • బాలికల అభ్యున్నతకి చేస్తున్న కృషి ప్రశంసించిన తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

హైదరాబాద్, ఫిబ్రవరి 2024 : సేవా భారతి తెలంగాణ అద్వర్యంలో బాలికల సాధికారత, “కిషోరి వికాస్” కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 21/10/5 కె రన్ 8వ ఎడిషన్‌ గచ్చిబౌలి లో ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ఈ రన్ ను స్టేడియంలో తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జండా ఊపి ప్రారంభిచారు. గవర్నర్ తో పాటు ఫ్రీడమ్ ఆయిల్‌ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్ర శేఖర రెడ్డి, గ్లోబల్‌డేటా మేనేజింగ్ డైరెక్టర్, ఇండియన్ ఆపరేషన్స్ హెడ్ రాహుల్ భాటియా కూడా ఉన్నారు. 

ఈ సందర్భందా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ సమాజంలోని అభాగ్యుల వర్గాల అభ్యున్నతి కోసం సేవా భారతి తెలంగాణ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో ఆడపిల్లల సాధికారత కోసం ఉద్దేశించిన కార్యక్రమాల ప్రాముఖ్యతక గురించి కొనియాడారు. ఇప్పటికే సేవా భారతి 10,000 మంది బాలికల జీవితాలను ప్రభావితం చేసిందని, 2030 నాటికి 100,000 మంది బాలికలను లక్ష్యంతో చేరుకోవాలని డాక్టర్ సౌందరరాజన్ పిలుపునిచ్చారు. 

5, 10, 21 కిలోమీటర్ల, మేర మూడు విభాగాల్లో కొనసాగిన ఈ రన్ లో కార్పొరేట్‌లు, వారి కుటుంబాలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు,విద్యార్థుల పది వేలకు పైగా పాలుపంచుకున్నారు. గచ్చి బౌలి స్టేడియం నుండి ప్రారంభమై రన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వరకు 5 కిలోమీటర్లు కొనసాగగా, సెంట్రల్ యూనివర్శిటీ మీదుగా 10 కిలోమీటర్లు మరియు 21 కిలోమీటర్ల రన్ తిరిగి స్టేడియానికి చేరుకుంది. 

సేవా భారతి తెలంగాణ ప్రెసిడెంట్ దుర్గా రెడ్డి మాట్లాడుతూ Infosys, GEP, Palreddy Foundation of PalTech, BDL, Synopsys, HealthEdge, HealthOnUs, ECIL, SPMCIL, Calyx.ai, Cotiviti, Pega Systems, Reputation, Avineon, Prolifics, TechGLotechWave, SailotechWave, టెక్వేదిక, నార్తర్న్ టూల్ + ఎక్విప్‌మెంట్, స్ప్లాష్‌బిఐ, హ్యాపీ హైదరాబాద్, హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, హెచ్‌సియు, రన్‌ఫిట్ ప్రో, ఫీవర్ ఎఫ్ఎమ్, రేడియో మిర్చి, రేడియో సిటీ, ఐబ్రిడ్జ్ డిజిటల్, iQ301, సుమన్ టీవీ, రెబాలాంజ్, నేషనలిస్ట్ టీవీ హబ్, నిజాం , IDRF, మరియు సేవా ఇంటర్నేషనల్ సేవా భారతికి మద్దతునిచ్చాయన్నారు. 

ఈ రన్ వేదికలో సేవా భారతి తెలంగాణ జనరల్ సెక్రటరీ రామ్ మూర్తి, కోశాధికారి సుబ్రహణ్యం, సోషల్ సెక్టార్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.