గోదావరిఖని లో రెండు ఏటీఎంలలో చోరీ

గోదావరిఖని లో రెండు ఏటీఎంలలో చోరీ
  • రూ.15 లక్షల వరకు డబ్బులు మయమైనట్లు అంచనా

ముద్ర, గోదావరిఖని టౌన్:పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని రెండు ఎస్బిఐ ఎటిఎంలలో దొంగలు పడ్డారు. పారిశ్రామిక ప్రాంతంలోని గౌతమి నగర్ ఎస్బిఐ ఎటిఎంను శనివారం తెల్లవారుజామున గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లారు.

అలాగే గోదావరిఖని పట్టణ శివారు గంగానగర్ ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గౌతమీ నగర్ లో ఉన్న ఏటీఎంలో సుమారు రూ.15 లక్షల వరకు డబ్బులు ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. గౌతమి నగర్ లో ఉన్న ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాకు స్ప్రే చల్లి గ్యాస్ కట్టర్ తో మిషన్ ను కట్ చేసి చాకచక్యంగా చోరికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడకు చేరుకొని సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలను బట్టి  దర్యాప్తు చేస్తున్నారు.