కోదాడ మున్సిపాలిటీ నూతన చైర్ పర్సన్ , వైస్ చైర్మన్ ఎన్నిక

కోదాడ మున్సిపాలిటీ నూతన చైర్ పర్సన్ , వైస్ చైర్మన్ ఎన్నిక
  • మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లు
  • ఓటింగ్ కు దూరంగా ఐదుగురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు

ముద్ర ప్రతినిధి , కోదాడ:- కోదాడ మున్సిపాలిటీ నూతన చైర్ పర్సన్ , వైస్ చైర్మన్ లకు శనివారం ఎన్నిక ప్రక్రియ మొదలయింది . ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు క్యాoప్ కు వెళ్లిన కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు . మొత్తం 35 మంది కౌన్సిలర్లకు ఒక కౌన్సిలర్ మరణించగా 34 మందిలో మాజీ మున్సిపల్ చైర్మన్ వనపర్తి. శిరీష , వైస్ చైర్మన్ వెంపటి పద్మ , కౌన్సిలర్లు బెజవాడ శిరీష , ఎస్ కె షఫీ, కల్లూరి పద్మజ లు ఓటింగ్ కు గైరుహాజరయ్యారు . మిగతా 29 మంది కౌన్సిలర్లు ఓటింగ్ కు హాజరవ్వగా చైర్ పర్సన్ గా 4 వ వార్డుకు చెందిన సామినేని ప్రమీల , వైస్ చైర్మన్ గా 6 వ వార్డుకు చెందిన కందుల కోటేశ్వర రావుల ఎన్నిక ఏకగ్రీవం కానుడటంతో ఎన్నిక ప్రక్రియ ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగుతుంది . ఎన్నిక ను ఆర్డీఓ సూర్యనారాయణ , మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ లు నిర్వహిస్తున్నారు .