సునిల్ రెడ్డి కే మంథని బీజేపీ ఎమ్మెల్యే టికెట్..

సునిల్ రెడ్డి కే మంథని బీజేపీ ఎమ్మెల్యే టికెట్..
  • సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు 
  • రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ కొండాపాక సత్య ప్రకాష్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  మంథని బిజెపి ఎమ్మెల్యే టికెట్ బిజెపి నేత చందుపట్ల సునీల్ రెడ్డి కే వస్తుందని, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను బిజెపి కార్యకర్తలు, ప్రజలు నమ్మవద్దని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండపాక సత్య ప్రకాష్ అన్నారు. గురువారం మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో విలేకరుల సమావేశం లో సత్య ప్రకాష్ మాట్లాడుతూ గత 3 ఏండ్ల క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, మంథని బిజెపి నాయకులు, కార్యకర్తలు సునీల్ రెడ్డిని బిజెపి పార్టీలోకి రావాలని కోరగా కోరగా దాదాపు 30 వేల మంది తో సునీల్ రెడ్డి బీజేపీ పార్టీ లో చేరారని, గ్రామ స్థాయి లో, బూత్ స్థాయి లో పార్టీ కోసం పాటుపడుతూ, భూపాలపల్లి జిల్లా లోని 5 మండలలో గ్రామ గ్రామన  పాదయాత్ర తో పార్టీ అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడ్డారని, పోటీ లేని చోట  కొంత మంది నాయకులు కార్యకర్తలను  మనస్థాపం చెందే విధంగా కార్యక్రమలు చేస్తున్నారని, ఒక బీజేపీ కార్యకర్త 100 మంది కార్యకర్తలతో సమానంగా పని చేస్తున్నారని, కార్యకర్తలు, నాయకులు కుటిల రాజకీయలకు లొంగకుండా బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు.
దసరా పండుగ, జాతీయ నాయకుల సమావేశల వల్ల కొంత ఆలస్యం అయిందని,  మంథని ప్రాంతంలో బీజేపీ గెలుస్తుందనే అక్కసు తో కార్యకర్తలను, ప్రజలను అయోమయానికి  గురిచేస్తూ, పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం మంథని టికెట్  సునీల్ రెడ్డి  కే ఇస్తామని తెలిపిందన్నారు. మంథని లో ఇన్ని రోజులు ఇద్దరికీ మధ్యే పోటీ అని భావించి ఇప్పుడు మూడో వ్యక్తి సునీల్ రెడ్డి బరిలోకి రావడంతో జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు సునీల్ రెడ్డి కి టికెట్ రాకుండా కుటిల రాజకీయం చేస్తున్నారని అన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు వదిలి పార్టీ జెండా మోసి కష్టడ్డ కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా  మారుతుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అన్నారు. 

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు, జిల్లా అధికార ప్రతినిధి పోతార వేణి క్రాంతికుమార్, అన్ని మండలాల అధ్యక్షులు, జంగాపల్లి అజయ్, ములుమూరు శ్రీనివాస్, వీరబోయిన రాజేందర్, పెయ్యాల కుమార్, ముడుతనపల్లి ప్రభాకర్, పిలుమర్రి సంపత్, బొమ్మన భాస్కర్ రెడ్డి, కోయల్ కార్ నిరంజన్, సిరిపురం శ్రీమన్నారాయణ, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కొవ్వు సత్యనారాయణ, మచ్చగిరి రాము, కోరబోయిన మల్లికార్జున్, సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జ్ తోట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.