మండల పరిధిలోని గానుగుబండ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటా ప్రచారం

మండల పరిధిలోని గానుగుబండ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటా ప్రచారం

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి మండల పరిధిలోని గానుగుబండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా  జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్  ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ బిఅర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరిస్తూ  బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ మేనుఫెస్ట్ గురించి  ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే ఈనెల  29 ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరవుతున్న  తిరుమలగిరిలో జరిగే భారీ భహిరంగ సబను జయప్రదం చేయాలని రాములు గౌడ్ ప్రజలను కోరారు*. తుంగతుర్తి
నియోజికవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలపై కృషి చేస్తూ ప్రతి ఊరులో  గడప గడపకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కు ఓటు వేయాలని రాములు గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోలపాక పరమేష్, మాజీ ఎంపిటిసి  దుర్గయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు గుండగాని శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు కంచర్ల కుశలవ రెడ్డి, యూత్ అధ్యక్షుడు పంజాల ప్రవీణ్,వీరన్న, పంజాల యాదగిరి,గుండ గాని సురేష్, పోలెపాక సోమయ్య, మల్లేష్, రమేష్, వార్డ్ మెంబర్లు సూర్య ప్రకాష్, కట్ల చంద్రయ్య, ఆశాలు, నాగమ్మ బి ఆర్ ఎస్ కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.