భక్తి,త్యాగం,కరుణ లకు ప్రతి రూపమే బక్రీద్

భక్తి,త్యాగం,కరుణ లకు ప్రతి రూపమే బక్రీద్
  • సమాజ హితాన్ని కోరుకునే పర్వదినం
  • సర్వమత సౌబ్రాత్వానికి తెలంగాణా ప్రతీక
  • మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: భక్తి,త్యాగం,కరుణలకు బక్రీద్ ప్రతి రూపమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని ఆయన చెప్పారు.బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ ఈద్గ వద్ద జరిగిన బక్రీద్ పర్వదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఆయన స్వయంగా కలిసి అలాయ్ బలాయ్ చేసుకున్నారు .

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వమత సౌబ్రాత్వానికి తెలంగాణా ప్రతీకగా నిలిచిందన్నారు.గంగా జమునా తెహజీబ్ ను కాపాడుకుంటూ తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగిస్తున్నామన్నారు.స్వరాష్ట్రంలో సూపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు.మైనారిటీ సంక్షేమంతో పాటు మైనారిటీలను ఉన్నత విద్యావంతులు గా తీర్చి దిద్దేందుకు మైనారిటీ గురుకులాలు నెలకొల్పిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.