త్యాగానికి ప్రతీక బక్రీద్ - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

త్యాగానికి ప్రతీక బక్రీద్ - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రతీక అని, త్యాగం, సహనం బక్రీద్ ఇచ్చే సందేశాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని ఈద్గా వద్ద బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.