సాయి చంద్ మరణం తెలంగాణ గడ్డకు తీరని లోటు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

సాయి చంద్ మరణం తెలంగాణ గడ్డకు తీరని లోటు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మెట్‌పల్లి ముద్ర: తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు,తెలంగాణ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచందు మృతి తెలంగాణ గడ్డకు తీరని లోటని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేల చేసి, అమరులైన విద్యార్థుల తల్లుల కడుపుకోత పై తన గళం తో శివుణ్ణి ప్రశ్నించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ను కళ్ళారా చూసి. ఇప్పుడిప్పుడే వికసిస్తున్న తెలంగాణ అభివృద్ధిని చూసే సమయంలో గుండె పోటుతో మరణించడం జీర్ణించుకోలేని విశయం అన్నారు. సాయి చంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.