ఘనంగా పోచమ్మ బోనాలు

ఘనంగా పోచమ్మ బోనాలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణంలోని 6వ వార్డు గోవిందుపల్లే ఆదర్శ మున్నూరు కాపు సంఘం, 4వ  వార్డులో చెరువు కట్ట వద్ద వరాల పోచమ్మ బోనాలు, వంజరి సంఘం, అచ్చు బండ పోచమ్మ ప్రాంతంలో మహిళల పోచమ్మ తల్లికి బోనాలు ఘనంగా నిర్వహించారు.

అందంగా అలంకరించిన బోనాలను తలఫై ఎత్తుకొని డప్పు చప్పుల్ల మద్య ఉరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ , జిల్లా లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్, సీనియర్ నాయకులు దావా సురేష్ , కౌన్సిలర్ కొలగాని ప్రేమలత సత్యం, బుగ్గారం ఎంపిపి బాదినేని రాజమణి రాజేందర్, మున్నూరు కాపు మహిళలు తదితరులు పాల్గొన్నారు.