బదిలీ పై వెళుతున్న రిజర్వ్  ఇన్స్పెక్టర్ కు సన్మానించిన ఎస్పీ 

బదిలీ పై వెళుతున్న రిజర్వ్  ఇన్స్పెక్టర్ కు సన్మానించిన ఎస్పీ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీ లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కి బదిలీ పై వెళుతున్న రిజర్వు ఇన్స్పెక్టర్ వామనమూర్తిని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ శాలువా తో  సన్మానించి ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణమని  ఎక్కడ విధులు నిర్వహించిన అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కాలానుగుణంగా ఎన్నో మార్పులు సమాజంలో వస్తున్నాయని సమయాన్ని సందర్భాన్ని బట్టి విధులు నిర్వర్తించాలని విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం RI వామనమూర్తి  మాట్లాడుతూ జిల్లా లో సుమారు నాలుగు సంవత్సరాల పాటు  నిర్వర్తించిన విధులు సంతృప్తి నిఛ్చాయని  పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిది అని అన్నారు.