చెరువుల పండగ కాదు చీకటి రోజు...

చెరువుల పండగ కాదు చీకటి రోజు...
  • చెరువుల పండుగను బహిష్కరించాలి
  • మత్స్యకార సంఘం అధ్యక్షుడు బాధ దేవరాజు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న నిర్వహించే మృగశిరకార్తె సందర్భంగా చెరువలు, కుంటల వద్ద సంబురాలు చేయాలని పిలుపునిచ్చిందని, దీనిని గంగపత్రులు బహిష్కరించాలని జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామ మత్స్యకార సంఘం అధ్యక్షుడు బాధ దేవరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య సహకార సంఘం ఏర్పడి 1964 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్, అధ్యక్షులుగా గంగపుత్రులే కొనసాగుతున్నారని, ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ముదిరాజ్ కులస్తులను చైర్మన్ పదవిని కట్టబెట్టారని అన్నారు.

గంగపుత్ర జాతికి ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసినందుకు ఈ నెల 8 చీకటి రోజుగా ప్రకటిస్తున్నామని, దశాబ్ది ఉత్సవాలను బహి ష్కరించాలంటూ గంగమ్మ ఆలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గజ్జి రాజేష్ , ప్రధాన కార్యదర్శి మైలారం వినయ్, గజ్జి మల్లేష్ తో పాటు కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.