మంత్రుల పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి సమీక్ష

మంత్రుల పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి సమీక్ష

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట:  రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు త్వరలో జిల్లా పర్యటన నిమిత్తం ముందస్తు ఏర్పాట్ల గురించి క్షేత్ర స్థాయిలో  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు. బుధవారం మంత్రుల పర్యటించే ప్రాంతాలు సిద్ధి పేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సూడా)పరిధిలో గల ఇర్కోడ్ గ్రామ శివారులో గల సిద్దిపేట మాడల్ స్లాటర్ హౌస్, పట్టణంలోని కప్పల గుంట చెరువు, ఇక్బాల్ మీనార్ ,గద్ద బోమ్మ, స్వచ్ఛ బడి కేంద్రాలను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

3 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో నిర్మించిన మాడల్ స్లాటర్ హౌస్ లో మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి  చెయ్యాలని ఆయన సూచించారు. చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, బయట ఎలాంటి చెత్త చెదారం, గుంటలు లేకుండా మోరం నింపాలని సూచించారు.అన్ని పనులు పూర్తి చెసి ప్రారంభోత్సవానికి సిద్దం చెయ్యాలని కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.కప్పలగుంట చెరువు సుందరీకరణకు శంకుస్థాపన నిమిత్తం పక్కన గల చెత్త కుప్పలను తొలగించాలని ఆదేశించారు. చుట్టు చెరువు హద్దు కనిపించేలా పలు కర్రలకు రంగులతో కుడిన జెండాలు అమర్చాలని, కట్టపై సుందరీకరణ మ్యాప్ ప్లేక్సిలను అమర్చాల న్నారు.

 గద్దబోమ్మ వద్ద పట్టణంలో చెపట్టే పలు సిసి రోడ్ల, మిగతా అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఏర్పాట్లు చేయ్యాలన్నారు. రాష్ట్రంలోనే ఎంతగానో గుర్తింపు పోందిన సిద్దిపేట స్వచ్ఛ బడి,చెత్త నుండి ఎరువుల తయారి,హోమ్ కంపోస్టు సెంటర్ లను కలెక్టర్ పరిశీలించారు.  సేవలు, కంపోస్టు ఎరువు తయారీ,నెల నెల ఎంత సేకరణ లాంటి పూర్తి వివరాలను తెలపాలని సెంటర్ అధికారులకు తెలియజేశారు.కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మాజి మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, కౌన్సిలర్ లు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.