పోలీస్ కుటుంబాలకు వైద్యుల కౌన్సిలింగ్ 

పోలీస్ కుటుంబాలకు వైద్యుల కౌన్సిలింగ్ 

రక్షక భటులకు హెల్త్ ప్రొఫైల్

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట: రక్షక బటులకు వారి కుటుంబీకులకు వైద్యులు ఆరోగ్య విషయమై కౌన్సిలింగ్ నిర్వహించారు సిద్దిపేట జిల్లాలో పోలీస్ కుటుంబాల హెల్త్ ప్రొఫైల్ తయారవుతోంది బుధవారం నాడు సిద్దిపేటలోని ప్రభుత్వ  వైద్య కళాశాలలో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, సిద్దిపేట మెడికల్ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ విమల థామస్ వారి బృందం ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

రక్షకభటుల ఆరోగ్య రక్ష కార్యక్రమంలో బాగంగా  ఇంతకుముందు జరిగిన మూడు దశలలోని వివరాలతో కూడిన ఆరోగ్య సమాచారం గురించి పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులతో ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలో పోలీస్ కమిషనర్ శ్వేత, మెడికల్ అధికారుల సమక్షంలో సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేసి, కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ విమల థామస్, ప్రొఫెసర్ మధు, క్రాంతి అసిస్టెంట్ ప్రొఫెసర్, చంద్రశేఖర్ సిఎస్ఆర్ ఎం డి సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్  బిక్షపతి, సిద్దిపేట రూరల్ సీఐ జానకి రామ్ రెడ్డి, ఆర్ఐలు రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆర్ఎస్ఐ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.