జగిత్యాల ను జిల్లాగా చేసి ప్రజలకు పరిపాలన సౌలభ్యం కల్పించిన గొప్ప వ్యక్తి కేసీఆర్  - డా. సంజయ్ కుమార్ 

జగిత్యాల ను జిల్లాగా చేసి ప్రజలకు పరిపాలన సౌలభ్యం కల్పించిన గొప్ప వ్యక్తి కేసీఆర్  - డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :  జగిత్యాల ను జిల్లాగా చేసి ప్రజలకు పరిపాలన సౌలభ్యం కల్పించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల రూరల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతలు పాల్గొని మాట్లాడారు.

జగిత్యాలను జిల్లాగా, జగిత్యాల రూరల్, బీర్ పూర్ లను నూతన మండలాలు ఏర్పాటు చేసి, రాయికల్ మున్సిపాలిటీగా చేసి, నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజల కలను సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్  అని అన్నారు. గతంలో ఏ ఒక్క నాయకుడు ప్రజలకు పరిపాలన సౌకర్యాలు కల్పించాలని ఆలోచన చేయలేదని పదవులు అనుభవించి పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మంచి గౌరవం దక్కిందని అనేక పథకాలు రూపొందించి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకమని అన్నారు. సుపరిపాలన సందర్భంగా రాష్ట్రంలో జరిగిన పరిపాలన విధానాన్ని ప్రజలకు తెలియజేయడానికి దశాబ్ది వేడుకల కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు.

ముఖ్యమంత్రి  రైతు కేంద్రంగా పరిపాలన సాగిస్తూ వ్యవసాయానికి పెద్దపీట వేశారని వ్యవసాయం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్ జిల్లా, మండల రైతు బంధు సమితి సభ్యులు బాల ముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, ఎమ్మార్వో నవీన్, ఎంపిడివో రాజేశ్వరి, ఎంఏ ఓ గాయత్రి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.