బోధ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -  డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

బోధ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -  డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

ముద్ర,అనంతగిరి:ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, త్రిపురవరం పరిధిలో బోధ వ్యాధి నిర్మూలన కొరకు మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పరిశీలించారు. స్థానిక  ప్రాథమిక పాఠశాల, త్రిపురవరంలో ఏర్పాటుచేసిన ఎం.డి.ఏ బూత్ ను పరిశీలించారు. భోధ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సంవత్సరానికి ఒకసారి ఆల్బెండజోల్ మరియు డీఈసీ మాత్రలు వేసుకోవడం ద్వారా వ్యాధి రాకుండా కాపాడవచ్చు అని అన్నారు.శరీరంలో వ్యాధి లక్షణాలు రావడానికి 10 నుంచి 20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందని.ఒక్కసారి వ్యాధి వస్తే అది మన శరీరం నుంచి వెళ్లడం అసాధ్యమని అన్నారు.

అనంతరం విద్యార్థులతో మాత్రలు మిగించారు.శరీరంలో మైక్రో ఫైలేరియా లార్వా నిర్మూలన కొరకు ప్రతి ఒక్కరు ఈ మాత్రలు మింగాలని పిలుపునిచ్చారు.రెండు నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్ర ఒకటి, డీఈసీ మాత్ర ఒకటి, 6 నుంచి 14 సంవత్సరాల లోపు వారికి ఆల్బెండజోల్ ఒకటి, డిఈసి రెండు, 15 నుంచి ఆపైన వారికి ఆల్బెండజోల్ 1 , డిఇసి మూడు మాత్రలు వేయాలి. భోజనం తర్వాత మాత్రమే ఈ మాత్రలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,త్రిపురవరం వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న , కళావతి విజయకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఆరోగ్య కార్యకర్తలు రాధా, మహేశ్వరి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.