వర్షా కాలంలో వేసవిని తలపిస్తున్న ఎండలు.

వర్షా కాలంలో వేసవిని తలపిస్తున్న ఎండలు.
  • నీరు లేక మాడి పోతున్న వరి నార్లు
  • నారుని బతికించడాని చేతితో నీరు పోస్తున్న రైతు..
  • ఎటు చూసినా బీల్లు,దుక్కి దున్ని సిద్దం చేసి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు.
  • పలు చోట్ల ఫలించిన మిషన్ కాకతీయ ముందు చూపు.

ముద్ర ,పాలకీ:-పాలకీడు మండల వ్యాప్తంగా రైతు గోస అగమ్యగోచరంగా మారింది వర్షాకాలం లో ఎండలు దంచికొడుతున్నయి.ఏటా ఆగస్ట్ మాసం లో 90 శాతం వరి నాట్లు పూర్తయి కలుపు దశలో వుండేవి ఈ సారి ఎటు చూసినా బీళ్ళు,దుక్కి దున్ని నెర్రలు బారిన నేలలు దర్శనమిస్తున్నాయి.వర్షాలపై ఆశతో కొందరు రైతులు వడ్లు జల్లి సిద్దం చేసారు.వచ్చే జల్లు పోయే జల్లుకి అవి మొలకెత్తినప్పటికి ఎండల దాటికి మారిపోతున్నాయి.ఎప్పటిలాగే వర్షాలు కురుస్తాయి కాలువ నీరు వచ్చి పంటలు పండించాలని నారు పెంచుకున్న రతులకు నిరాశే మిగిలింది.వరి నారూని కాపాడుకోడానికి చేతితో నీరు పోసే పరిస్థితికి వచ్చింది .అక్కడక్కడ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితం కనిపిస్తుంది.చెరువుల్లో నీరు వుండడంతో  చేరువుకింద ఆయకట్టు కు నీరందడంతో ప్రస్తుతానికి బాగానే వుంది.ఇక ప్రత్తి రైతుల గోస వర్ణనాతీతంగా మారింది తొలి దశలోనే మొక్కలు నీరు లేక బెట్టకొచ్చి సాకనిపోతున్నాయి.

ముందుగా జల్లిన వరి నార్లను చెడగొట్టి మళ్ళీ వేసేందుకు రైతాంగం సిద్దంగా వున్నారు.కానీ వరుణ దేవుని కరుణ లేకపోవడం తో నిరాశతో ఆకాశం వైపు చూస్తున్నారు.నాగార్జున సాగర్ నీటిమట్టం రోజు రోజుకి పడిపోవడంతో కుడ్,ఎడమ కాలువలకు అధికారులు నీటిని ఆపేశారు.ఇక ఎటు చూసినా వరుణ దేవుడు కరుణించన్దే ఈ ఏడు పంటలు పండే పరిస్థితి కనపడటంలేదు .వరుణ దేవుడు కరుణించి మెగాలు కరిగించి నింగినుంచి నుంచి నేల పైకి చినుకు రావాలని కోరుకుందాం.పుడమి పులకరించి పంటలు పండాలని ఆశిద్దాం..